News26th Jul 03:11 PMSunil Byrisetty1 min read
ప్రధాన్ రాజీనామా పోరాట విజయమే!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థులు, యువత పోరాట విజయమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. ఎన్‌టీఏను రద్దు చేసి, మెడికల్ ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థులు, యువత పోరాట విజయమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు.
ఎన్‌టీఏను రద్దు చేసి, మెడికల్ ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని డిమాండ్ చేశారు. అందుకోసం
ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద సమ నిరసనలకు సీపీఐ పిలుపునిచ్చారు. నీట్ పేపర్ లీక్‌తో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నిరసనల్లో నివాళులర్పించాలని కోరారు.
ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులు, యువజనులపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు.