News30th Oct 01:17 PMSunil Byrisetty1 min read

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలి

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుచేసే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని.. ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పిపిపి) విధానం

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలి
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుచేసే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని.. ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పిపిపి) విధానంలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 590 తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల, పెనుగొండ పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ప్రాంతాలలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్సిస్ (పిపిపి) విధానంలో ఏర్పాటు చేసేందుకు 2025 సెప్టెంబర్ 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం: 590 జారీ చేసిందని తెలిపారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరించే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా పావులు కదపడం దుర్మార్గమని ఖండించారు. వైద్య విద్య కళాశాలలను సిపిపి విధానంలో ఏర్పాటు చేయడం ద్వారా రూ.3,700 కోట్ల అభివృద్ధి ఖర్చు ఏటా రూ.500 కోట్ల నిర్వహణావ్యయం ఆదా అవుతుందంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఈ విధానం దీర్ఘకాలికంగా రాష్ట్రానికి నష్టం కలిగిస్తుందని విశ్లేషించారు. సుమారు 60 ఏళ్లపాటు ప్రభుత్వ భూమి, వనరులు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లి, వారికి ఆదాయవనరులుగా మారతాయని, . వైద్య విద్య పూర్తిగా వ్యాపారపరమవుతుందని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh Government
Medical Colleges
Privatization
CPI
G Eeswarayya
Medical Education
Public Private Partnership
PPP Model
GO 590
వైద్య విద్యా సంస్కరణలు
మార్కాపురం
మదనపల్లి
ఆదోని
పులివెందుల
Scroll for the next article