News30th Nov 04:40 PMSunil Byrisetty1 min read
భూమన, వైవీ సుబ్బారెడ్డిపై క్రిమినల్ కేసులకు డిమాండ్
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన పరకామణి చోరీ కేసులో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన డిమాండ్ చేశారు. లోకాయుక్తలో కేసును రాజీ చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన పరకామణి చోరీ కేసులో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన డిమాండ్ చేశారు. లోకాయుక్తలో కేసును రాజీ చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన తీవ్రంగా కోరారు. పరకామణి కేసు విచారణను తక్షణమే పూర్తి చేసి, నిందితులను శిక్షించాలని నారాయణ డిమాండ్ చేశారు. "కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటారా? లోకాయుక్తలో ఈ కేసును రాజీ చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు ఎవరు? వారెందుకు రాజీ చేశారు?" అంటూ ఆయన నిలదీశారు. పరకామణి కేసులో మళ్లీ విచారణ జరపాలని హైకోర్టు సీఐడీని ఆదేశించిన తీరు అభినందనీయమని సీపీఐ నేత నారాయణ ప్రశంసించారు. దీనితో ఈ కేసులో నిజాలు బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.