News23rd Aug 09:02 AMSunil Byrisetty1 min read
జోహార్ కామ్రేడ్ సురవరం
భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి (83) కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి (83) కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు . 1942లో జన్మించిన సుధాకర్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుండి సిపిఐ అనుబంధ విద్యార్థి పోరాటాల్లో పాల్గొన్న 1971లో సిపిఐ జాతీయ మండలి కి ఎంపిక అయ్యారు. 1998లో నల్గొండ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన రెండవసారి 2004లో ఎంపీగా గెలుపొందారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కీలక భూమిక పోషించారు. అనేక ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచారు. నిస్వార్థ కమ్యూనిస్టు జీవితాన్ని గడిపిన సురవరం నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల కోసం ఢిల్లీ వరకు ఉద్యమాన్ని తీసుకువెళ్లి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్లోరైడ్ పై దృష్టి సారించేలా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే దిశగా జరిగిన కృషిలో ఆయన పాత్ర ఎనలేనిది. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఇంటివద్దనే ఆయన విశ్రాంతి పొందుతున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతి చెందారన్న వార్త కమ్యూనిస్టు పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది.