News11th Jul 10:38 AMSunil Byrisetty1 min read
సీఎం చంద్రబాబుకు సీపీఐ లేఖ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. నెల్లూరు జిల్లా, ఉలవపాడు మండలం, కరేడు గ్రామంలో బలవంతపు భూసమీకరణ నిలిపివేయాలని కోరారు. స్థానిక ప్రజలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. నెల్లూరు జిల్లా, ఉలవపాడు మండలం, కరేడు గ్రామంలో బలవంతపు భూసమీకరణ నిలిపివేయాలని కోరారు. స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ షిరిడిసాయి అనుబంధ ఇండోసోల్ కంపెనీకి 8458 ఎకరాల భూమిని అప్పగించాలనుకోవటం దుర్మార్గమని ఖండించారు గ్రామస్తులపై పోలీసు నిర్బంధం తగదన్నారు. గత వైసిపి ప్రభుత్వ అనాలోచిత విధానాలనే మీ ప్రభుత్వం కొనసాగించటం సరికాదని లేఖలో సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు.