News1st Jun 06:12 PMSunil Byrisetty1 min read

రేషనుకు నగదు బదిలీ వద్దు

రేషన్‌ సరుకులు వద్దనుకుంటే నగదు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ వ్యతిరేకించింది. ఈ నిర్ణయం ప్రజా పంపిణీ వ్యవస్థను నీరుగార్చడానికి, ధరలు పెరగడానికి దారిత

రేషనుకు నగదు బదిలీ వద్దు
రేషన్‌ సరుకులు వద్దనుకుంటే నగదు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ వ్యతిరేకించింది. ఈ నిర్ణయం ప్రజా పంపిణీ వ్యవస్థను నీరుగార్చడానికి, ధరలు పెరగడానికి దారితీస్తుందని పేర్కొంది. డిబిటి పేరుతో పేద ప్రజల కడుపుకొట్టవద్దని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నదన్నారు. రేషన్‌ ద్వారా తీసుకుంటున్న బియ్యం అమ్ముకుంటున్నారనే పేరుతో దొడ్డిదోవన నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని సిపిఐ(యం) వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. నగదు బదిలీ ప్రవేశపెట్టడమంటే ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజల నుండి దూరం చేయడమేనని అభిప్రాయపడ్డారు. మార్కెట్‌లో బియ్యం ధరలు పెరిగినా ప్రభుత్వం ఇచ్చే నగదు మాత్రం పెరగదన్నారు. కాబట్టి రేషన్‌ సరుకులు బదులు నగదు ఇచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నట్లు నేతలు పేర్కొన్నారు.
Andhra Pradesh news
cpim
protest
Ration
public distribution system
రేషనుకు నగదు బదిలీ వద్దు
Scroll for the next article