News17th Apr 08:52 AMSunil Byrisetty1 min read
గోశాలలో సీపీఐ నారాయణ.. పరిస్థితిపై ప్రకటన
తిరుమల గోశాలలో వందకుపైగా ఆవులు మరణించాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలపై సీపీఐ నారాయణ అక్కడకు వెళ్లి పరిశీలించారు. గోవుల ఆరోగ్య పరిస్థితి, దాణాపై ఆరా తీశారు. టీటీడీ గోశాల
తిరుమల గోశాలలో వందకుపైగా ఆవులు మరణించాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలపై సీపీఐ నారాయణ అక్కడకు వెళ్లి పరిశీలించారు.
గోవుల ఆరోగ్య పరిస్థితి, దాణాపై ఆరా తీశారు.
టీటీడీ గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదన్నారు.
ప్రతినిత్యం గోవులను వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
గోవులకు కావాల్సినంత దాణా ఉందని.. ఆవులన్నీ పుష్టిగా ఉన్నాయని తెలిపారు.
గోశాలను వైసీపీ రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదని అన్నారు.
టీటీడీ గౌరవం తగ్గేలా మాట్లాడవద్దని సూచించారు.
గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని.. ఆయనను సస్పెండ్ చేయడం కాకుండా, విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.