News3rd Dec 04:47 PMSunil Byrisetty1 min read

మంగళగిరి ప్రజా సమస్యలపై సీపీఐ వినతి.. లోకేష్ హామీ

మంగళగిరి నియోజకవర్గంలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఐటి, విద్యాశాఖామాత్యులు నారా లోకేష్ కి సీపీఐ నియోజకవర్గ సమితి నాయకులు వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గ ప్ర

మంగళగిరి ప్రజా సమస్యలపై సీపీఐ వినతి.. లోకేష్ హామీ
మంగళగిరి నియోజకవర్గంలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఐటి, విద్యాశాఖామాత్యులు నారా లోకేష్ కి సీపీఐ నియోజకవర్గ సమితి నాయకులు వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా వివరించిన సీపీఐ ప్రతినిధి బృందం, అభివృద్ధి పనులకు వేగం చేకూర్చాలని మంత్రిని కోరింది. రేవేంద్రపాడు గ్రామం నుండి మంగళగిరి తెనాలి రోడ్డువరకు రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించడంతో పాటు రోడ్డుపై ఉన్న గుంతలను తక్షణమే పూడ్చివేయాలని కోరారు. రేవేంద్రపాడు వద్ద బకింగ్‌హామ్ కెనాల్‌పై ఉన్న పాత వంతెన స్థానంలో డబుల్ వంతెన నిర్మాణం అత్యవసరమని పేర్కొన్నారు. చినకాకాని, మంగళగిరి రత్నాల చెరువు, కాజ గ్రామాల్లో వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం అవసరమని, నిడమర్రు రైల్వే గేటు, తాడేపల్లిలో ప్యారీ కంపెనీ గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని ప్రతిపాదించారు. తాడేపల్లి నుంచి కాజ వరకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని, కార్పోరేషన్ పరిధిలోని అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను తక్షణం పూర్తి చేయాలని కోరారు.మంగళగిరి పట్టణంలో బైపాస్‌ రోడ్డునుంచి గౌతమబుద్ధ రోడ్డువరకు ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని సీపీఐ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గుంటూరు ఛానల్‌కు రెండు వైపులా రివిట్‌మెంట్‌ వాల్ నిర్మాణం, గ్రామీణ రైతుల కోసం డొంక రోడ్ల ఆధునికీకరణను చేపట్టాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని “బి ఫారం’’ పట్టాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించడం, ఇళ్ల స్థలాలు లేని 20 వేల కుటుంబాలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించివ్వాలని ప్రతినిధులు పత్రంలో పేర్కొన్నారు.
Andhra Pradesh
Mangalagiri Issues
CPI Petition
Nara Lokesh
Public Problems
Road Expansion
Drainage System
Flood Solutions
వరద ముంపు పరిష్కారం
రైల్వే ఫ్లైఓవర్
అభివృద్ధి పనులు
Scroll for the next article