News11th Jul 04:41 PMSunil Byrisetty1 min read

ఎన్నికల ప్రధాన అధికారికి సిపిఐ లేఖ

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ మరో 3 నెలలు పొడిగించాలని కోరారు. ఎస్ఐఆర్ ప

ఎన్నికల ప్రధాన అధికారికి సిపిఐ లేఖ
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ మరో 3 నెలలు పొడిగించాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓట్ల గల్లంతు, బిఎల్ వోల అలసత్వం, ఫారాలు నింపడంలో ఇబ్బందులు, రాజకీయ ప్రమేయం వంటి పలు ఇబ్బందులు వెలుగు చూస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు చాలాచోట్ల 50 శాతం కూడా ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తికాలేదని వివరించారు. ఆన్లైన్ లో నమోదు చేసుకున్న ఓటర్లు ఎన్యుమరేషన్ స్థితిని తెలుసుకోలేకపోతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన ఓటర్ల గల్లంతు ప్రజాస్వామ్యానికి పెను విఘాతమని గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు.
Andhra Pradesh
Chief Electoral Officer
CPI
Gujjula Eswaraiah
Vivek Yadav
Special Intensive Revision
SIR
Voter List Revision
ఓటర్ల జాబితా సవరణ
ఎన్నికల కమిషన్
ఓటరు నమోదు
Scroll for the next article