News29th Aug 11:22 AMSunil Byrisetty1 min read

సీఎంకు సీపీఐ నేత లేఖ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీ బకాయిలు విడుదల చేసి ఆదుకోండని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పార

సీఎంకు సీపీఐ నేత లేఖ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీ బకాయిలు విడుదల చేసి ఆదుకోండని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు దాదాపు రూ.1200 కోట్ల వరకు సబ్సిడీ బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. గత ఏడాదికాలంగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి నిధులు మంజూరు చేయాలని కోరారు.
CPI
Chandrababu Naidu
Andhra Pradesh
SC ST Entrepreneurs
Subsidy Dues
K Ramakrishna
Industrial Support
Government Funds
CPI Letter
సీఎంకు సీపీఐ నేత లేఖ
పారిశ్రామిక ప్రోత్సాహం
Scroll for the next article