News3rd Oct 05:10 PMSunil Byrisetty1 min read

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై సీఎంకు సీపీఐ లేఖ

రాష్ట్రంలో అత్యంత కీలకమైనది విద్యుత్ రంగమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు గత కొ

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై సీఎంకు సీపీఐ లేఖ
రాష్ట్రంలో అత్యంత కీలకమైనది విద్యుత్ రంగమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల ప్రధాన సమస్యలలో భాగంగా కాంట్రాక్ట్ కార్మికుల సంఘటలో విలీనమవటం, ఉద్యోగ భద్రత కల్పించాలనే వల ఉద్దేశ్యంతో పలువురు చర్చలు జరిపినప్పటికీ యథా స్థితిగానే సమస్యలు పరిష్కారం కాలేదని వివరించారు. గత ఎన్నికలకు ముందు విద్యుత్ సంస్థలలోని కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఈనెల 15వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లే నిర్ణయంతో ఇప్పటికే విద్యుత్ శాఖకు నోటీసులు ఇచ్చిందన్నారు.
Andhra Pradesh
CPI
K Ramakrishna
Chandrababu Naidu
Electricity Employees
Contract Workers
Power Sector
Regularization Promise
Employee Security
విద్యుత్ జేఏసీ
సమ్మె నోటీసు
కార్మిక సంఘాలు
విద్యుత్ శాఖ సమస్యలు
Scroll for the next article