News15th Dec 05:08 PMSunil Byrisetty1 min read

హోంగార్డుల కోసం హోంమంత్రికి సీపీఐ లేఖ

హోం శాఖమంత్రి వంగలపూడి అనితకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఏపీలోని హోంగార్డులకు పూర్తి వేతనాలు చెల్లించి, ప్రభుత్వ సంక్షేమ పథ

హోంగార్డుల కోసం హోంమంత్రికి సీపీఐ లేఖ
హోం శాఖమంత్రి వంగలపూడి అనితకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఏపీలోని హోంగార్డులకు పూర్తి వేతనాలు చెల్లించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం హోంగార్డులకు రోజువారి వేతనం రూ.1,124/- చెల్లించాల్సి ఉందన్నారు. ఏపీలోని హోంగార్డులకు యూనిఫాం, వాషింగ్, కవాతు అలవెన్స్ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పెంచి ఇవ్వాలని కోరారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ హోంగార్డులు న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హోంగార్డుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘంలో వెంటనే చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఈశ్వరయ్య లేఖలో కోరారు.
Andhra Pradesh
CPI
Home Guards
AP Politics
Supreme Court Orders
Home Minister Anita
Fair Wages
Welfare Schemes
Scroll for the next article