News18th Aug 09:58 AMSunil Byrisetty1 min read

పోలవరం నిర్వాసితులకు సీపీఎం అండ

పోలవరం ముంపు మండలాల్లో నిర్వాసితులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ.బేబి తెలిపారు. నిర్వాసిత ప్రాంతాల్లో సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని తె

పోలవరం నిర్వాసితులకు సీపీఎం అండ
పోలవరం ముంపు మండలాల్లో నిర్వాసితులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ.బేబి తెలిపారు. నిర్వాసిత ప్రాంతాల్లో సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని తెలిపారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికొదిలేశాయని రాజ్యసభ సభ్యులు, సిపిఎం ఫ్లోర్‌ లీడర్‌ జాన్‌ బ్రిట్టాస్‌ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల లక్షా ఆరు వేల కుటుంబాలు నిర్వాసితులుగా మారాయని, వారికి భరోసా కల్పించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదని అన్నారు. నిర్వాసితుల్లో 80 శాతం గిరిజనులు ఇంకా పునరావాస ఫలితాలు పొందలేదని, అందుకే నిర్వాసిత గ్రామాల్లో పర్యటించి, అక్కడ ప్రజలతో స్వయంగా మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకుని, పార్లమెంట్లో వారి పక్షాన తమ గొంతు వినిపిస్తామని చెప్పారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి రూ.33 వేల కోట్లు కావాల్సి ఉన్నప్పటికీ ఆ మేరకు నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వాసితులు తమ జీవనాధారం కోల్పోయి రోడ్డున పడుతున్నారన్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఎపి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Andhra Pradesh
Polavaram project
CPM
M.A. Baby
John Brittas
displaced families
tribal rights
rehabilitation
R&R package
నిర్వాసిత కుటుంబాలు
పోలవరం ప్రాజెక్ట్
Scroll for the next article