National25th Jul 04:45 PMSunil Byrisetty1 min read
విద్యార్థుల పోరాటం విజయం
22 మంది విద్యార్థులను బలి తీసుకొన్న “విద్యా మాఫియా” పై విజయం సాధించిన విద్యార్థులను, యువతీ యువకులను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అభినందించింది. ఎట్టకేలకు మోడీ ప్రభుత్వానికి యువశక్తి ముం
22 మంది విద్యార్థులను బలి తీసుకొన్న “విద్యా మాఫియా” పై విజయం సాధించిన విద్యార్థులను, యువతీ యువకులను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అభినందించింది. ఎట్టకేలకు మోడీ ప్రభుత్వానికి యువశక్తి ముందు తలవంచక తప్పలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజీనామా చేశాక కూడా ఉద్యమంపై జాతి వ్యతిరేకులంటూ నిందలు మోపడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు అంగీకరించి విద్యా వ్యవస్థను కార్పొరేట్ చెరనుండి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాపితంగా ఎంతో పట్టుదలతో, మొక్కవోని దీక్షతో పోరాడిన ఫలితంగానే కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తీవ్రమైన నిర్బంధాన్ని సైతం ఎదుర్కొని దేశవ్యాపితంగా వివిధ తరగతులు ఇచ్చిన మద్దతుతో విద్యార్థులు, యువకులు చేసిన పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదని వ్యాఖ్యానించారు. విద్యార్థుల కోర్కెలలో ప్రధానమైన విద్యామంత్రి రాజీనామా చేసినా ప్రశ్నాపత్రాల లీకేజిలకు ప్రధాన కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.