News3rd Oct 12:11 PMSunil Byrisetty1 min read
కరువు మండలాలపై కంటి తుడుపు ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వ కరువు మండలాల ప్రకటన ప్రజలను, రైతు, కూలీలను తీవ్రంగా నిరాశపరిచిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ పూర్తిగా
రాష్ట్ర ప్రభుత్వ కరువు మండలాల ప్రకటన ప్రజలను, రైతు, కూలీలను తీవ్రంగా నిరాశపరిచిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో 544 మండలాలను కరువుగా గుర్తించి జాతీయ విపత్తుగా ప్రకటించాలని, అందుకు తగినట్లుగా ప్యాకేజీ ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు. పరిస్థితికనుగుణంగా కేంద్ర ప్రభుత్వ కరువు మాన్యువల్ 2016ను సవరించాలని కోరుతున్నదన్నారు. ఈ సంవత్సర ఆరంభం నుండే ఎల్‌నినోతో వర్షాలు పడవని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మెల్లగా కళ్లు తెరిచి 388 మండలాలను అందులోనూ 283 మాత్రమే తీవ్ర కరువుగా ప్రకటించడం అన్యాయమని ఖండించారు. అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం, పల్నాడు చివరకు గుంటూరు, బాపట్ల, ఎన్‌టిఆర్, కృష్ణా, నెల్లూరు జిల్లాల పశ్చిమ మండలాలు, డెల్టా చివర భూములు కూడా ఎండిపోయాయని ఆందోలన వ్యక్తం చేశారు. పంట వేయని భూములు ఖాళీగా ఉన్నాయని, రైతులు పెట్టుబడి నష్టపోయారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి రాష్ట్రాన్ని కరువు బారి నుండి ఆదుకునేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.