News10th Nov 04:28 PMSunil Byrisetty1 min read

రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ అమలు నిలిపివేయాలి

పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను రాష్ట్రంలో అమలు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్

రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ అమలు నిలిపివేయాలి
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను రాష్ట్రంలో అమలు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు పార్టీలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక సమగ్ర సవరణను రాష్ట్రంలో నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. దీనిపై వెంటనే రాజకీయ పార్టీల సమావేశం జరపాలని రాష్ట్ర ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ను సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తోందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక సమగ్ర సవరణ చేయాలని ఆదేశాలిచ్చిన 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మన రాష్ట్రం గురించి పేర్కొనకపోయినా రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ అమలుకు పూనుకోవడం గర్హనీయమని ఖండించారు. బీహార్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ చేసిన సందర్భంలో దేశవ్యాపితంగా అనేక అభ్యంతరాలు వచ్చాయని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్‌ లెక్క చేయలేదని వ్యాఖ్యానించారు. కాబట్టి రాష్ట్రంలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఎస్‌ఐఆర్‌ అమలు చేయడాన్ని వ్యతిరేకించాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తోందని పేర్కొన్నారు.
Andhra Pradesh
CPI(M)
SIR
Voter List Revision
Andhra Pradesh
Democracy
Election Commission
Political News
Electoral Reform
ఎన్నికల వివాదం
రాజకీయ ప్రకటన
ఓటర్ల హక్కులు
Scroll for the next article