News29th Oct 12:24 PMSunil Byrisetty1 min read
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుఫాను బాధితులను ఆదుకోవాలి
అర్నబ్ తుఫానుకు అతలాకుతలమైన ప్రజలు, రైతాంగానికి ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయం సంతృప్తికరంగా లేదని సీపీఎం పేర్కొంది. ప్రజల ప్రాణాలు కాపాడడం ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించినా వ
అర్నబ్ తుఫానుకు అతలాకుతలమైన ప్రజలు, రైతాంగానికి ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయం సంతృప్తికరంగా లేదని సీపీఎం పేర్కొంది. ప్రజల ప్రాణాలు కాపాడడం ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించినా వివిధ ఘటనల్లో 9 మంది మరణించారని తెలిపింది. మృతులకు సీపీఎం సంతాపం, క్షతగాత్రులకు సానుభూతి ప్రకటించింది. ఇది సాధారణ తుఫాను కాదని, ఎల్నినో ప్రభావంతో పంటలు వేయక లేదా ఎండిపోయి దిగుబడి తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్న సమయంలో వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తుఫాను బాధిత ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి 25కిలోల బియ్యంతో పాటు ఒక నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. మరణించినవారికి రూ.25 లక్షలు, మునిగిపోయిన ఇళ్ళకు రూ.25 వేలు, చేనేత, మత్స్యకార్మికులు, చిన్న దుకాణ దారులకు రూ.50 వేలు చొప్పున, ఆటో కార్మికులు, తోపుడు బండ్లకు రూ.25 వేలు చొప్పున ఇవ్వాలని కోరారు.