News23rd Sep 12:23 PMSunil Byrisetty1 min read
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై న్యాయ విచారణ జరపాలి
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై న్యాయ విచారణ జరపాలని సీపీఎం డిమాండ్ చేసింది. డీఎస్సీ అక్రమాలపై నిరసనకు దిగిన వైసీపీ కార్యకర్తలు/ నిరుద్యోగులపై లాఠీచార్జీని ఖండిస్తున్నామని ఆ పార
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై న్యాయ విచారణ జరపాలని సీపీఎం డిమాండ్ చేసింది. డీఎస్సీ అక్రమాలపై నిరసనకు దిగిన వైసీపీ కార్యకర్తలు/ నిరుద్యోగులపై లాఠీచార్జీని ఖండిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. తమ సమస్యలపై నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యంలో పార్టీలు, సంఘాలు, సంస్థల ప్రాథమిక హక్కన్నారు. ఆ హక్కును నిరాకరించడం అప్రజాస్వామికమని తెలిపారు. సవాళ్లకు ప్రతి సవాళ్లు బదులుగా సమస్యను పరిష్కరించడానికి న్యాయ విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. తమ ప్రయోజనాల కోసం ఉపాధ్యాయులను అడ్డం పెట్టుకోవడం సమంజసం కాదన్నారు. ఆరోపణలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పకుండా ఉపాధ్యాయులను పోటీగా రంగంలోకి దింపడం సమస్యను మరింత జఠిలం చేస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలను మానుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఎం కోరుతుందని అన్నారు.