News12th Jul 03:42 PMSunil Byrisetty1 min read

బలవంతపు భూసేకరణ తగదు

ఉండవల్లిలో రెండున్నర ఎకరాలకు పైగా రైతుల భూమిని దౌర్జన్యంగా సేకరించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. వారంతా పేద రైతులని స్పష్టం చేసింది. భూమి తప్ప మరో దిక్కు లేదని

బలవంతపు భూసేకరణ తగదు
ఉండవల్లిలో రెండున్నర ఎకరాలకు పైగా రైతుల భూమిని దౌర్జన్యంగా సేకరించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. వారంతా పేద రైతులని స్పష్టం చేసింది. భూమి తప్ప మరో దిక్కు లేదని పేర్కొంది. హైకోర్టు ఆర్డర్‌పై రైతులతో సామరస్యంగా చర్చలు జరిపి వారికి న్యాయంగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నది. పంటలను ధ్వంసం చేసి, రైతులపై దౌర్జన్యం చేసిన, మహిళలని చూడకుండా అవమానకరంగా మాట్లాడిన, పోలీసు, రెవిన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. ఉండవల్లిలో ఎకరం భూమి ఐదు నుండి ఏడు కోట్ల రూపాయలకు పైగా ఉండగా, ఎకరం విలువ కోటి 18 లక్షలుగా లెక్క గట్టి, రెండు కోట్ల 62 లక్షల రూపాయలకు అవార్డు ఇచ్చి, ఆగ మేఘాల మీద దౌర్జన్యంగా భూములు లాక్కోవటం అక్రమమని ఇహనందించింది. మహిళలతో సహా రైతులను నిర్బంధించి, చేతికొచ్చిన పంటను నాశనం చేసి బుల్డోజర్లతో అప్పటికప్పుడే రోడ్డు వేయడానికి ప్రయత్నించటం అన్యాయమని సీపీఎం రాష్ట్ర అధ్యక్షుడు వి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ఖండించారు. ప్రభుత్వం, సిఆర్‌డిఏ రైతులతో చర్చలు జరిపి న్యాయమైన పరిహారాన్ని రైతులకు చెల్లించి భూములు స్వాధీనం చేసుకుని రోడ్డు వేసుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ, దౌర్జన్య పూర్వకంగా వ్యవహరించడం గర్హనీయమని పేర్కొన్నారు. రైతులతో చర్చలు జరిపి, వారికి మార్కెట్ విలువకు అనుగుణంగా న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh
CPI(M)
Undavalli
Land Acquisition
Farmers Protest
CRDA
Compensation
V Srinivasa Rao
తాడేపల్లి
గుంటూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
ఏపీ వార్తలు
Scroll for the next article