News17th Oct 05:42 PMSunil Byrisetty1 min read
ఎస్ఐఆర్ ప్రక్రియపై సిపిఐ(యం) అసంతృప్తి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) రాష్ట్రంలో జరుగుతున్న తీరుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇచ్చిన వివరణపై సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఓటర్లను ఎవ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) రాష్ట్రంలో జరుగుతున్న తీరుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇచ్చిన వివరణపై సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఓటర్లను ఎవరూ వదిలివేయకూడదనే సిఈవో ప్రకటనకు ఆచరణలో అమలు జరిగినదానికి తేడా ఉందని వాటితో సమగ్ర విచారణ జరగాలని సిపిఐ(యం) కోరింది. ఫారం-7పై వచ్చిన వార్తలకు సిఈవో ప్రకటనలో ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం అనుమానాలకు దారితీస్తున్నది. అక్టోబర్ 14 నాటికి రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,75,69,896 అని ఎన్నికల సంఘం ప్రకటించింది. ముసాయిదా జాబితా విడుదల తరువాత 44,89,512 ఓట్లు తొలగించి, అభ్యంతరాలు స్వీకరించిన తరువాత 3,31,052 మళ్ళీ తొలగించారు. దీనికి కారణాలు తెలియాల్సి వుంది. అనుమానాలు నివృత్తి చేయవలసిన బాధ్యత ఎన్నికల సంఘంపై వుంది. ఫారం-6 లో ఉన్న వాటికి సమాధానం వ్రాయలేక ఇవ్వనివారు, అందుబాటులో లేనివారు ఎంతమందిని తొలగించారో తెలియదు. ఈఆర్‌వోలు బల్క్‌గా ఎంట్రీవేసి ఓటర్లను తొలగించారనే వార్తలు కూడా వచ్చాయి. కొత్తగా చేర్చిన ఓటర్లు 7,62,766 అని ప్రకటించారు. కానీ మొత్తం దరఖాస్తు చేసుకున్నవారెంతమంది, తిరస్కరించినవారెందరు? తదితర వివరాలన్నీ కారణాలతోసహా బహిరంగంగా ప్రకటించాల’ని సిపిఐ(యం) డిమాండ్ చేసింది.