News2nd Aug 11:08 AMSunil Byrisetty1 min read
మరో రూ. 12,771 కోట్ల విద్యుత్ భారం ఆపాలి
విద్యుత్ ఛార్జీలు పెంచబోమని పైగా ట్రూడౌన్ పేరుతో ధరలు తగ్గిస్తామని ప్రకటించి నెల రోజులు కూడా కాకుండానే మరలా ట్రూఅప్ పేరుతో మరో రూ.12,771 కోట్లు భారాన్ని మోపడాన్ని సిపిఐ(యం) రాష్
విద్యుత్ ఛార్జీలు పెంచబోమని పైగా ట్రూడౌన్ పేరుతో ధరలు తగ్గిస్తామని ప్రకటించి నెల రోజులు కూడా కాకుండానే మరలా ట్రూఅప్ పేరుతో మరో రూ.12,771 కోట్లు భారాన్ని మోపడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తక్షణం దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నది. 2019`20 నుండి 2023`24 సంవత్సరాలకు సంబంధించి విద్యుత్ రిటైల్ వ్యాపార లోటు పేరుతో రూ.12,771 కోట్లు ట్రూ అప్ భారం వేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణా మండలికి ప్రతిపాదనలు పంపి బహిరంగ ప్రకటన చేశాయి. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఇది జరగదు. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఛార్జీల పెంపుదలను నిలుపుదల చేయాలి.
గత 36 నెలల నుండి 2014`19 కాలానికి సంబంధించిన రూ.3 వేలకోట్లు ట్రూ అప్ చార్జీలు వసూలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 2022`23, 2023`24 సంవత్సరాల కాలానికి రూ.15,485 కోట్లు సర్దుబాటు చార్జీల భారం మోపారు. ఇదికాక 2024`25 సంవత్సరానికి ప్రతినెల యూనిట్‌కు 40 పై. చొప్పున ఒక్క సంవత్సరంలోనే రూ. 2787 కోట్లు వసూలు చేశారు. స్మార్ట్ మీటర్లు వలన అదనపు భారాలు సిద్ధంగా ఉన్నాయని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రకటించింది.