Politics20th Aug 04:16 PMSunil Byrisetty1 min read
స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలొద్దు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్ పర్సన్ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికల పద్దతిని సిపిఐ(యం) వ్యతిరేకిస్తున్నది. దీనివల్ల ప్రజలకు దగ్గరగా వుండే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, య
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్ పర్సన్ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికల పద్దతిని సిపిఐ(యం) వ్యతిరేకిస్తున్నది. దీనివల్ల ప్రజలకు దగ్గరగా వుండే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, యంపిటీసీలు, జెడ్పిటీసీలకు ప్రాధాన్యత వుండదు. దిష్టి బొమ్మలుగా మిగిలి పోతారు. అధికారం కేంద్రీకృతమై పోతుంది. 73, 74 రాజ్యాంగ సవరణ స్పూర్తి దెబ్బతింటుంది. ప్రజాస్వామ్యం బలహీన పడుతుంది. అందువల్ల ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలి. వెనుకబడిన తరగతులకు 34% రిజర్వేషన్లు ఖాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ స్వాగతిస్తున్నది. అయితే ఇది అమల్లోకి రావాలంటే రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని సవరించాలి. మిశ్రా కమిషన్ సైతం దీన్ని ఎత్తిచూపింది. ఇందుకు పార్లమెంటు చట్టం చేయాలి. కేంద్ర ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బిజెపిలు ఈ రాజ్యాంగ సవరణ జరిగేటట్లు చూడాలని డిమాండ్ చేసింది.