News13th Jul 04:06 PMSunil Byrisetty1 min read
భూములు బలవంతంగా తీసుకోవటం అన్యాయం
రాజధాని ఉండవల్లి ప్రాంతంలో రైతులతో సంప్రదింపులు జరపకుండా, రైతుల వద్ద నుండి బలవంతపు భూసేకరణ చేయటం అక్రమమని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు అన్నారు. ఉండవల
రాజధాని ఉండవల్లి ప్రాంతంలో రైతులతో సంప్రదింపులు జరపకుండా, రైతుల వద్ద నుండి బలవంతపు భూసేకరణ చేయటం అక్రమమని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు అన్నారు. ఉండవల్లిలో సిపిఎం నాయకులతో కలిసి, సి ఆర్ డి ఏ, ప్రభుత్వం ఉండవల్లి రైతుల బలవంతపు భూసేకరణ చేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం రైతుల భూములు తీసుకునేందుకు, దౌర్జన్యంగా బుల్డోజర్లతో రైతుల భూములను బలవంతంగా తీసుకున్నారని విమర్శించారు. చట్టాలను లెక్కచేయకుండా, కోర్టులో వివాదం ఉండగా, కోర్టు తీర్పులు పట్టించుకోకుండా దౌర్జన్యంగా రైతుల పంట భూములు తీసుకోవటాన్ని సిపిఎం వ్యతిరేకిస్తుందని అన్నారు. మహిళలని చూడకుండా, విచక్షణ రహితంగా మహిళలను జుట్టు పట్టుకొని లాగివేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. భూములు కోల్పోతున్న రైతుల ఆర్తనాదాలు వినకుండా, ప్రభుత్వం భూములు లాక్కోవడం అన్యాయం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధానిగా ఉండాలని రైతులే స్వయంగా ఉద్యమం చేస్తే, రైతులకు మద్దతు ఇచ్చిన కూటమి ప్రభుత్వం నేడు పేద రైతుల వద్ద నుండి దౌర్జన్యం చేసి, భూములు లాక్కోవడం అన్యాయం కాదా? అని విమర్శించారు.