News10th Jan 03:13 PMSunil Byrisetty1 min read
ఉపాధి చట్టం రద్దుకు నిరసనగా ‘‘ఇంటింటికీ ఉపాధి’’ ప్రచారం
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి జీరాంజీ పథకాన్ని తీసుకురావడానికి నిరసనంగా సిపిఎం ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా ‘‘ఇంటింటికీ ఉపాధి’’ పేరుతో కార్యక్రమం నిర్వహించనున
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి జీరాంజీ పథకాన్ని తీసుకురావడానికి నిరసనంగా సిపిఎం ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా ‘‘ఇంటింటికీ ఉపాధి’’ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. 14వ తేదీన భోగిమంటల్లో జీరాంజీ చట్టం కాపీలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథంతో కలిసి ఆయన మాట్లాడారు. పనిదినాలు పెంపు పేరుతో గతంలో ఉన్న చట్టాన్ని మార్చామని చెబుతున్నారని, దీనికి చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. వామపక్షాలుగా తాము 200 పనిదినాలు కల్పించాలని డిమాండు చేస్తున్నామని, వాస్తవంగా ఇప్పుడు 50 పనిదినాలు కూడా ఉండటం లేదని తెలిపారు. రూ.304 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని ఉన్నా ఇప్పుడు కనీసం రూ.220 కూడా రావడం లేదని, వాటిని మెరుగుపర్చాల్సింది పోయి చట్టాన్ని రద్దు చేశారని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా జనవరి 18 నుండి 21 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యాన ‘‘ఇంటింటికీ ఉపాధి’’ పేరుతో ప్రజలను చైతన్యం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.