Politics4th Aug 02:36 PMSunil Byrisetty1 min read
బాబు ఎక్కిన పడవ మునుగుతోంది
బీహార్‌లోని బంకీపూర్ తీర్పుతో మోడీ పడవ మునుగుతోందని రుజువైందని, అందులో కూర్చున్న చంద్రబాబు, టిడిపి పార్టీ కూడా మునగడం ఖాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బిజ
బీహార్‌లోని బంకీపూర్ తీర్పుతో మోడీ పడవ మునుగుతోందని రుజువైందని, అందులో కూర్చున్న చంద్రబాబు, టిడిపి పార్టీ కూడా మునగడం ఖాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షులు ప్రాతినిధ్యం వహించిన బంకీపూర్ ఉప ఎన్నికల్లో సగానికి సగం ఓట్లు కోల్పోయి బిజెపి ఘోర పరాజయం పాలయిందని, దీనికి కారణమైన అక్కడ ప్రజలకు సిపిఎం తరుపున అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అవినీతి అక్రమాలతో విసిగిపోయిన ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. విద్యార్ధులపై మోడీ అణచివేతకు ప్రజలు ప్రతీకారం తీర్చుకున్నారన్నారు. ఉప ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్‌లోనూ ఓడిపోయారని, గుజరాత్‌లో గెలిచినా గతంలో వచ్చిన ఓట్ల కంటే సగం తగ్గాయని తెలిపారు. బిజెపికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై దారుణమైన లాఠీఛార్జి జరిగిందని, దాన్ని సుప్రీం కోర్టు కూడా ఖండించిందని అన్నారు. అయినా పాఠం నేర్చుకోకుండా అదే సమయంలో చంద్రబాబు మోడీతో సభ పెట్టి స్తోత్ర పాఠాలు చెప్పారని, ముఖ్యమంత్రి స్థాయిని కూడా మర్చిపోయి దిగజారడం కంటే అవమానం మరొకటి లేదని అన్నారు.