News10th Nov 03:24 PMSunil Byrisetty1 min read

ఎన్నికల అక్రమాలపై రేపు నిరసన

భాగస్వామ్య సదస్సుల పేరుతో పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పించలేని ప్రభుత్వం ఆ పేరుతో కార్పొరేట్ టూరిజం నిర్వహిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. పెట

ఎన్నికల అక్రమాలపై రేపు నిరసన
భాగస్వామ్య సదస్సుల పేరుతో పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పించలేని ప్రభుత్వం ఆ పేరుతో కార్పొరేట్ టూరిజం నిర్వహిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. పెట్టుబడుల పేరుతో 2016 నుండి నిర్వహిస్తున్న సదస్సుల ద్వారా చేసుకున్న ఎంఓయుల్లో పదిశాతం పెట్టుబడులు కూడా రాలేదని, కనీసం రెండుశాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ జరిగిన ఒప్పందాల ప్రకారమే 50 లక్షల మందికి ఉపాధి రావాల్సి ఉందని, కానీ కొద్దిమందికి కూడా దక్కలేదని అన్నారు. కోనసీమలో రిలయన్స్ కంపెనీ గ్యాస్ కంపెనీ ఏర్పాటు సమయంలో లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పారని 3200 మందికి మంచి ఇవ్వలేదని తెలిపారు. 30 వేలమందికి ఉపాధి అన్న కియాలో 12 వేలమందికి కూడా ఇవ్వలేదన్నారు. స్పిన్నింగ్ మిల్లులు, డైరీలు, చక్కల ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, నష్టాలతో చిన్న పారిశ్రామికవేత్తలకు కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. కియా గురించి అరిగిపోయిన రికార్డులా చెప్పడం తప్ప మరొకటి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వకపోడం పక్కనబెడితే స్టీలు ప్లాంటులో పదివేల మందిని ఉద్యోగం నుండి తొలగించడంతో లక్షమందిపై ప్రభావం పడిందని తెలిపారు. ప్రభుత్వం పెట్టుబడి సదస్సులతోపాటు శ్రామిక సదస్సులు కూడా పెట్టి కార్మికుల హక్కులకు కాపాడాలని అన్నారు.
Scroll for the next article