News27th Oct 04:43 PMSunil Byrisetty1 min read

నీటి మీటర్ల 160 జివోను ఉపసంహరించాలి

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పథకాలన్నిటికీ మీటర్లు బిగించాలని, వాడకం ప్రాతిపదికన ప్రజలనుండి యూజర్ చార్జీలను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 160 జీవోను వెంటనే ఉపసంహరించుక

నీటి మీటర్ల 160 జివోను ఉపసంహరించాలి
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పథకాలన్నిటికీ మీటర్లు బిగించాలని, వాడకం ప్రాతిపదికన ప్రజలనుండి యూజర్ చార్జీలను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 160 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాలకు లోబడి ఈ జీవో జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటింటికీ మంచినీరు ఉచితం అంటూ జనాన్ని ఊరించి ఇప్పుడు మీటర్లు పెట్టి డబ్బు వసూలు చేస్తామనడం వంచన అని మండిపడింది. కేంద్ర బిజెపి ప్రభుత్వ ఒత్తిళ్ళకు లొంగి ప్రజలపై భారాలు వేయడాన్ని ప్రజలు తిరస్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రజలకు అందజేసే మంచినీటికి కూడా చార్జీల పేరిట డబుల్ ఇంజన్ సర్కార్ ఇలా కొల్లగొడుతోందని మండిపడ్డారు. ప్రజలంతా స్థానిక ఎన్నికలలో తలమునకలై ఉన్న సమయంలో దొంగ చాటున జీవోలు జారీ చేయడం దారుణమన్నారు. గ్రామీణ ప్రజలకు పనులు దొరకక అదేవిధంగా పండిన పంటకు న్యాయమైన ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
Scroll for the next article