News19th Nov 03:42 PMSunil Byrisetty1 min read

ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో నిన్న, ఈరోజు జరిగిన వరుస ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. మావోయిస్టులను ముందుగానే నిర్

ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో నిన్న, ఈరోజు జరిగిన వరుస ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి, అరెస్టుచేసి కోర్టు ముందు ఉంచే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు అన్యాయంగా భూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని వార్తలు వచ్చాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. చట్ట విరుద్ధమైన భూటకపు ఎన్‌కౌంటర్లను సిపిఐ(యం) ఖండిస్తున్నదన్నారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి నగరాల్లో పోలీసులు దాడులు చేసి 50 మందికి పైగా మావోయిస్టులు, వారి అనుయాయులను నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ చోట్ల నిర్బంధించబడిన వీరిని వెంటనే సంబంధిత న్యాయ స్థానాల ముందుంచాలని డిమాండ్ చేశారు. అమాయక గిరిజనులను మావోయిస్టులకు సహకరిస్తున్నారని, మిలిషియాగా పనిచేస్తున్నారని పోలీసులు వివిధ రూపాల్లో వేధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేధింపులను, నిర్భందాన్ని వెంటనే నిలిపివేయాలని, సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
AP News
Maredumilli Encounter
CPI(M)
Maoists
Judicial Inquiry
Police Action
Tribal Issues
గిరిజన సమస్యలు
మానవ హక్కులు
చట్ట వ్యవస్థ
న్యాయ విచారణ
Scroll for the next article