News7th Oct 04:02 PMSunil Byrisetty1 min read
కల్తీ మద్యంపై సమగ్ర న్యాయవిచారణ జరిపించాలి
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. కల్తీ మద్యం దందాపై సమగ్
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. కల్తీ మద్యం దందాపై సమగ్ర విచారణ జరిపించి మద్యపాన నిషేధానికి చర్యలు చేపట్టాలని, స్థానికంగా బూడిద కాలుష్యం వల్ల మంచినీటి కొరత లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మద్యం సీసాలను పగలగొట్టి మహిళలు తమ నిరసన తెలిపారు. అనంతరం కల్తీ మద్యం తయారుచేసిన గోడౌన్ నాయకులతో కలిసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుంది కానీ గుక్కెడు మంచినీళ్లు కరువైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లాలో తంబళ్లపల్లి కల్తీ మద్యం తయారీ ఇప్పుడు ఇబ్రహీంపట్నంలోని పరిసర ప్రాంతాల్లో కూడా బయటపడింది అన్నారు. ఓ కుటీర పరిశ్రమల కల్తీ మద్యం ఈ ప్రాంతంలో తయారు చేయడం అంత సామాన్యమైన విషయం కాదని, ప్రభుత్వంలోని పెద్దల అండదండలు లేకుండా జరగదని ఆయన అన్నారు. కుప్పలు తెప్పలుగా బయటపడిన కల్తీ మద్యం పై స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులు బాధ్యత వహించి సత్వరం స్వతంత్ర సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.