News10th Sep 04:38 PMSunil Byrisetty1 min read
11న బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిపిఎం మద్దతు
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సెప్టెంబర్ 11న నిర్వహిస్తున్న సమ్మెకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కే
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సెప్టెంబర్ 11న నిర్వహిస్తున్న సమ్మెకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రజలు ఈ సమ్మెకు సంఘీభావంగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకు ఉద్యోగులు భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడుకునేందుకు, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా సమ్మె నిర్వహిస్తున్నారని చెప్పారు. బ్యాంకు ఉద్యోగుల పోరాటం కేవలం వారి హక్కుల కోసం మాత్రమే కాదని, కేంద్ర బిజెపి ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే విధానాలను అమలు చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలను మెర్జర్ల పేరిట కుదిస్తున్నదని విమర్శించారు. బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడుకునేందుకు చేస్తున్న సమ్మెకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ మద్దతు తెలుపుతోందని పేర్కొన్నారు.