News9th Jul 02:20 PMSunil Byrisetty1 min read
ఏపీ స్థానికత ఉన్న హోం గార్డులను రాష్ట్రానికి రప్పించండి
హోంగార్డుల వేతనాల పెంపు, విదేశీ వైద్య విద్య పట్టభద్రుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేర్వేరుగా వినతి పత్రాలు ఇచ్చారు.
హోంగార్డుల వేతనాల పెంపు, విదేశీ వైద్య విద్య పట్టభద్రుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేర్వేరుగా వినతి పత్రాలు ఇచ్చారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. వైద్య నిపుణుల కొరత ఉన్న ప్రస్తుత తరుణంలో ఏపీఎంసీ నిబంధనల్ని మార్చుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో హోంగార్డుల వేతనాల పెంపు, పోలీసు సెలక్షన్లలో రాయితీలు కల్పించే అంశంపైనా నిర్ణయం తీసుకోవాలని రామకృష్ణ కోరారు. ప్రస్తుతం 400 మంది ఏపీ స్థానికత కలిగిన హోం గార్డులు తెలంగాణాలో పనిచేస్తున్నారని వారిని రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రామకృష్ణ సీఎంను కోరారు. వేతనం పెంపుతో పాటు పోలీసు సెలక్షన్లలో నిబంధనలను సడలించి హోంగార్డులకు అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.