News10th Oct 11:23 AMSunil Byrisetty1 min read
విజయవాడలో ముందస్తు అరెస్టులు, పోలీసుల నిర్బంధం
విజయవాడలో జరగనున్న "చలో లోక్ భవన్" కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి పోలీసులు.. సిపిఎం నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు ఇంటిక
విజయవాడలో జరగనున్న "చలో లోక్ భవన్" కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి పోలీసులు.. సిపిఎం నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు ఇంటికి అర్ధరాత్రి రెండు గంటలకు పోలీసులు వచ్చారు. విద్యార్ధి సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. ప్రసన్న కుమార్ ను అరెస్టు చేశారు. పాయికాపురం, శాంతినగర్ లో సిపిఎం నేత సిహెచ్ శ్రీనివాస్ ను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు ఇంటి వద్ద కాపలా కాస్తున్నారు. సిపిఎం నేత బోయి సత్యబాబు ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. దీంతో సీపీఎం నేతలు స్పందిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శాంతియుత ఆందోళనలకు అవకాశం ఇవ్వకుండా, నిర్బంధంతో అణిచివేయటం, ముందస్తు అరెస్టులు చేయటం, బెదిరింపులకు పాల్పడటం శోచనీయమని వ్యాఖ్యానించారు. దేశం మొత్తం ఓటు హక్కును హరించే ఎన్నికల కమిషనర్ రాజీనామా కోరుతూ, ప్రజాస్వామ్య విరుద్ధమైన సర్ ను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన జరుగుతుండగా, తెలుగుదేశం, జనసేన లు నోరు మెదపకపోగా, రాష్ట్రంలో ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకోవడం గర్హనీయమని పేర్కొన్నారు.