Politics9th Mar 05:45 PMSunil Byrisetty1 min read
గుంటూరులో సీపీఎం ప్రజా చైతన్య యాత్ర
టిడ్కో గృహాల లబ్ధిదారులను ప్రభుత్వాలు రుణగ్రస్తులను చేశాయని, గృహ సముదాయాలలో మౌలిక సదుపాయాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబ
టిడ్కో గృహాల లబ్ధిదారులను ప్రభుత్వాలు రుణగ్రస్తులను చేశాయని, గృహ సముదాయాలలో మౌలిక సదుపాయాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు.
సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం గుంటూరులోని టిడ్కో గ్రహ సముదాయాలను సందర్శించారు.
లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
బాబురావు మాట్లాడుతూ లబ్ధిదారులు బ్యాంకులో నుండి మూడున్నర లక్షల రుణం తీసుకుంటే 15 నుంచి 20 ఏళ్ల కాలంలో దాదాపు పదిన్నర లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని అన్నారు.
అసలు కంటే వడ్డీనే అధికంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా ఇల్లు ఇస్తామని చేసిన వాగ్దానం అమలు కాలేదన్నారు.
ప్రభుత్వం ఎన్నికల హామీలు నిలబెట్టుకొని లబ్ధిదారుల రుణాలను వడ్డీతో సహా భరించాలని కోరారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలన్నారు.