News14th Jul 04:36 PMSunil Byrisetty1 min read

ఇళ్ళు ఇచ్చే ప్రభుత్వమా? కొంపలు కూల్చే ప్రభుత్వమా?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొంపలు కూల్చే ప్రభుత్వంగా మారిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు దుయ్యబట్టారు. పాత రాజరాజేశ్వరి పేటలో ఐదు దశాబ్దల నుంచి నివసిస్త

ఇళ్ళు ఇచ్చే ప్రభుత్వమా? కొంపలు కూల్చే ప్రభుత్వమా?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొంపలు కూల్చే ప్రభుత్వంగా మారిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు దుయ్యబట్టారు. పాత రాజరాజేశ్వరి పేటలో ఐదు దశాబ్దల నుంచి నివసిస్తున్న పేదల ఇళ్ల తొలిగింపు కు రైల్వే అధికారులు నోటీసులు అంటిస్తే, పాలకులు మొద్దు నిద్ర పోతున్నారని నిలదీశారు. విజయవాడ రైల్వే డివిజనల్ అధికారులు పాత రాజ రాజేశ్వరి పేట లో రైల్వే ట్రాక్ ఆనుకొని నివసిస్తున్న ఇళ్లను ఆగష్టు ఐదున తొలగిస్తామని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో విజయవాడ రైల్వే అధికారుల చర్యలను వ్యతిరేకిస్తూ బాధితుల పక్షాన నిలిచి, సిపిఎం ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో మంగళవారం సిపిఎం పశ్చిమ కమిటీ ఆధ్వర్యంలో ఓల్డ్ ఆర్ ఆర్ పేటలో సిపిఎం నేతలు పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. ఇళ్ల తొలగింపు రద్దయ్యే వరకు సిపిఎం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. బాబురావు మాట్లాడుతూ.. ఎంపీ కేశినేని చిన్ని, స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ఓల్డ్ ఆర్ ఆర్ పేట వాసులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. బడా పారిశ్రామిక వేత్తలకు ఎకరా భూమి 99 పైసలు చొప్పున వేల ఎకరాల భూమిని కారు చౌకగా ధారాదత్తం చేసే ప్రభుత్వాలు, పేదలు నివసించే ఇళ్లను కూల్చడం పనిగా పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు.
Andhra Pradesh News
AP Politics
Vijayawada News
CPM
House Eviction
Railway Land
Demolition Drive
పేదల ఇళ్లు
గృహ హక్కులు
ప్రభుత్వంపై విమర్శలు
Scroll for the next article