News31st Jul 03:56 PMSunil Byrisetty1 min read
మెహర్బానీ కోసం విద్యార్థుల తరలింపా?
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం చెప్పేందుకు ఆంధ్రా ప్రభుత్వం మెహర్బానీ చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం చెప్పేందుకు ఆంధ్రా ప్రభుత్వం మెహర్బానీ చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. ప్రధాని పర్యటన కోసం గోదావరి, ఉత్తరాంధ్ర ఏజెన్సీ జిల్లాల్లో లో అన్ని స్కూళ్ళకు 2 రోజులు సెలవులు ప్రకటించడంతోపాటు వేలాదిమంది విద్యార్థులను తరలించడాన్ని తప్పుబట్టారు. ప్రధాని కోసం విద్యార్థులను, పిల్లలను ఇబ్బందులపాలు చేయడం తగదన్నారు. ధింసా నృత్యం పేరుతో ఆదివాసీ బాలికలను తరలించారన్నారు. ఆర్టీసి బస్సులన్నీ ఈ పనికి కేటాయించడంతో ప్రజలు కూడా రవాణాకు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పైగా గత రెండు మాసాలుగా విద్యార్థి ఉద్యమాన్ని అణచివేసిన పాలకులకు ఇలా అట్టహాసంగా స్వాగతం చెప్పడం యువతను అవమానించడమేనని పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, వందలకోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం గర్హనీయమని వ్యాఖ్యానించారు.