News26th Oct 01:18 PMSunil Byrisetty1 min read

సీఎం చంద్రబాబుకు సీపీఎం కార్యదర్శి లేఖ

సీఎం చంద్రబాబుకు సీపీఎం కార్యదర్శి లేఖ రాశారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై వాస్తవాలు చెప్పాలని కోరారు. గూగుల్ సెంటర్ తో 1.88 లక్షల ఉద్యోగాలు రావని తేల్చి చెప్పారు. కానీ లక్షల్లో ఉ

సీఎం చంద్రబాబుకు సీపీఎం కార్యదర్శి లేఖ
సీఎం చంద్రబాబుకు సీపీఎం కార్యదర్శి లేఖ రాశారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై వాస్తవాలు చెప్పాలని కోరారు. గూగుల్ సెంటర్ తో 1.88 లక్షల ఉద్యోగాలు రావని తేల్చి చెప్పారు. కానీ లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని భ్రమలు సృష్టిస్తున్నారని విమర్శించారు. డేటా సెంటర్ తో 5 వేల ఉద్యోగాలు వస్తాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారని గుర్తు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని పేర్కొన్నారు. వారిపై పోలీసుల గృహనిర్భంధాలు, ఆంక్షలు సరికావని ఖండించారు. రాజయ్యపేటలో భూసేకరణను విరమించుకోవాలని లేఖలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Chandrababu Naidu
CPM
Srinivasa Rao
Google Data Center
Andhra Pradesh
Job Creation
CPM Letter
Pemmassani Chandrasekhar
Bulk Drug Park
Land Acquisition
Rajayyapeta
బల్క్ డ్రగ్ పార్క్
భూసేకరణ
రాజయ్యపేట
పోలీసు ఆంక్షలు
రాజకీయ ఉద్యమం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
Scroll for the next article