News15th Sep 03:13 PMSunil Byrisetty1 min read
కరువు పరిస్థితిపై సీపీఎం బృందాల పర్యటన
రాష్ట్రంలో కరువు పరిస్థితి తీవ్రంగా ఉంది. 655 మండలాల్లో వర్షాభావం నెలకొంది. 80% పంటలు వేయలేదు. వేసినచోట కూడా పంటలు దెబ్బతిన్నాయి. మంచినీరు కొరత, విద్యుత్ కోత మొదలైంది. ఉపాధి లేక కూ
రాష్ట్రంలో కరువు పరిస్థితి తీవ్రంగా ఉంది. 655 మండలాల్లో వర్షాభావం నెలకొంది. 80% పంటలు వేయలేదు. వేసినచోట కూడా పంటలు దెబ్బతిన్నాయి. మంచినీరు కొరత, విద్యుత్ కోత మొదలైంది. ఉపాధి లేక కూలీలు అల్లాడుతున్నారు. దీనికి తోడు అధిక ధరల మోత. మొత్తం మీద ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంటున్నారు. రాష్ట్రంలో కరువు వల్ల సుమారు 5 లక్షల కోట్లకు పైగా పంట నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి తీవ్రతకనుగుణంగా స్పందించి కరువు నివారణ చర్యలు తీసుకోవడం లేదు. కేంద్ర బృందాలు పర్యటించి పరిస్థితిని అంచనా వేయలేదు. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 3 కరువు బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి. కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకరరెడ్డి, బి.బలరాం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16 నుంచి 21 వరకు ఈ మూడు బృందాలు వివిధ జిల్లాల్లో పర్యటిస్తాయి.