Politics30th Jul 05:27 PMSunil Byrisetty1 min read

అమరావతి పేరుతో అభివృద్ధిని పణంగా పెట్టొద్దు

అమరావతిలోని 29 గ్రామాలతో పాటు విజయవాడ గుంటూరు తదితర ప్రాంతాలను రాజధాని గానే భావించి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చెప్పటం హర్షణీయమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్

అమరావతి పేరుతో అభివృద్ధిని పణంగా పెట్టొద్దు
అమరావతిలోని 29 గ్రామాలతో పాటు విజయవాడ గుంటూరు తదితర ప్రాంతాలను రాజధాని గానే భావించి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చెప్పటం హర్షణీయమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. అయితే ముఖ్యమంత్రి మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన లేదని విమర్శించారు. అమరావతి అభివృద్ధి పేరుతో విజయవాడ గుంటూరు సిఆర్డిఏ ప్రాంత అభివృద్ధిని పాలకులు, పణంగా పెడుతున్నారన్నారు. ఉమ్మడి కృష్ణ,గుంటూరు జిల్లాలలోని 56 మండలాలతో 8600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2014లో క్యాపిటల్ రీజియన్ ప్రకటించారు, ఇందులో 1100 పైగా గ్రామాలు,10 పట్టణాలు, రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి, 70 లక్షలపైగా జనాభా ఉన్నారని తెలిపారు. విజయవాడ, సిఆర్డిఏ ప్రాంతాల అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నా స్థానిక ప్రజాప్రతినిధులు నోరు విప్పటం లేదు, మౌనం వహించడం శోచనీయమని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh Politics
CPM
CH Baburao
Amaravati
CRDA
Andhra Pradesh
Vijayawada
Guntur
Capital Region
రాజధాని ప్రాంతం
ప్రాంతీయ అభివృద్ధి
రాజకీయాలు
politics
Scroll for the next article