News20th Jul 11:57 AMSunil Byrisetty1 min read
ఏజెన్సీలో అశాంతిని సృష్టించొద్దు
ఆదివాసీల దీర్ఘకాలిక హక్కులకి భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో 1/70 చట్టాన్ని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కావాలని, దాన్ని రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయాలని, గతంలో సీఎం ఇచ
ఆదివాసీల దీర్ఘకాలిక హక్కులకి భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో 1/70 చట్టాన్ని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కావాలని, దాన్ని రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయాలని, గతంలో సీఎం ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రంపచోడవరంలో జరుగుతున్న ర్యాలీ, సభపై పోలీసులు తీవ్రమైన ఆంక్షలు పెట్టి జనం రాకుండా నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఖండించారు. రంపచోడవరం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి ఆదివాసి ప్రజలు ప్రత్యేకించి యువతి యువకులు ప్రశాంతంగా వస్తున్న సందర్భంలో వారిని దారి మధ్యలో ఆటంకపరిచి రెచ్చగొట్టడం ద్వారా ఏజెన్సీలో అశాంతి పరిస్థితిని ప్రభుత్వమే సృష్టిస్తున్నదన్నారు. 24వ తేదీన ముఖ్యమంత్రి రంపచోడవరం వస్తున్న సందర్భంగా వాటిపై స్పందించి పరిష్కరిస్తే యువతలో ఆందోళన పరిష్కారం అవుతుందని సూచించారు. 24న ముఖ్యమంత్రి సభకు కూడా ఇదే మాదిరి జనాన్ని రాకుండా ఆటంక పరుస్తారా అని ప్రశ్నించారు. హోం మంత్రి, డీజీపీ జోక్యం చేసుకొని రంపచోడవరం సభ ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.