Politics28th Jul 02:54 PMSunil Byrisetty1 min read

ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యేలను ప్రశ్నించండి

ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వ నేతలు స్థానిక సమస్యలపై ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు జరగలేదని, దీనిపై ప్రజలు ఇంటింటికీ వస్తున్న సందర్భంగా ఎమ్మెల్యేలను ప్రశ్నించాలని సిపిఎం రాష్ట్ర కార్

ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యేలను ప్రశ్నించండి
ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వ నేతలు స్థానిక సమస్యలపై ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు జరగలేదని, దీనిపై ప్రజలు ఇంటింటికీ వస్తున్న సందర్భంగా ఎమ్మెల్యేలను ప్రశ్నించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలనీ సూచించారు. రెండేళ్ లకాలంలో ప్రజలకు చేసిందేమీ లేకపోయినా ఇంటింటికీ టిడిపి పేరుతోపెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టారని, ఏమి సాధించారని ఈ కార్యక్రమం చేపట్టారని పశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు జరగలేదని, మహిళలకు పెన్షన్, నిరుద్యోగ భృతి, గిట్టుబాటు ధరలు వంటి కనీస హామీలు కూడా చేయలేదని విమర్శించారు. ఉన్న భూములన్నీ కార్పొరేట్లకు పందేరం చేస్తూ బిడ్డలే ఆస్తి అని సిఎం చంద్రబాబునాయుడు కొత్త పల్లవి ఎత్తుకున్నారని తెలిపారు. మంగళగిరిలో లోకేష్ 30 వేల ఇళ్లపట్టాలు ఇస్తానని చెప్పి 2000 ఇచ్చి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. ఇంటింటికీ తిరిగే సమయంలో నాయకులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకోవాలని సూచించారు.
Andhra Pradesh
AP Politics
TDP
CPM
V Srinivasa Rao
Chandrababu Naidu
Nara Lokesh
Election Promises
MLAs
కూటమి ప్రభుత్వం
కరువు పరిస్థితులు
నిరుద్యోగ భృతి
పెన్షన్
రైతులు
Scroll for the next article