News17th Dec 02:40 PMSunil Byrisetty1 min read

అదానికి దాసోహం అంటున్న కూటమి సర్కార్

స్మార్ట్ మీటర్లు, విద్యుత్ భారాలపై పోరాటం ఉదృతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్ అన్నారు. ప్రతి ఇంటిలో విద్యుత్ స్మా

అదానికి దాసోహం అంటున్న కూటమి సర్కార్
స్మార్ట్ మీటర్లు, విద్యుత్ భారాలపై పోరాటం ఉదృతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్ అన్నారు. ప్రతి ఇంటిలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల రూపంలో ఆదానీ దోపిడీని కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ను అధానీప్రదేశ్ గా సర్కార్ మారుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రములోని రెండు కోట్ల మంది వినియోగదారులకు బాగున్న మీటర్లు తొలగించి, స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల ద్వారా 25 వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజలపై కూటమి మోపుతోందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం, మోడీ మెప్పుకోసం, ఆదానీ సంస్థతో కుమ్మక్కై రాష్ట్ర ప్రజలను బలి చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా లోకేష్ తో సహా టిడిపి, కూటమి నేతలు స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కూటమి మాట తప్పిందని, నేడు బలవంతంగా మీటర్లు బిగిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Smart Meters
Power Tariff Hike
Adani
Coalition Government
CPM
ప్రజల సమస్యలు
విద్యుత్ విధానం
ప్రజా ఆందోళన
ప్రజల ప్రాధాన్యత
Scroll for the next article