News17th Oct 01:30 PMSunil Byrisetty1 min read
ఇళ్ల స్థలాలు కోరుతూ సిపిఎం ముట్టడి
మంగళగిరిలో ఇళ్ల స్థలాలు కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని వేలాదిమంది పేదలు ముట్టడించారు. కూటమి, లోకేష్ హామీ ఇచ్చిన విధంగా రెండు సెంట్లు స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల ని
మంగళగిరిలో ఇళ్ల స్థలాలు కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని వేలాదిమంది పేదలు ముట్టడించారు. కూటమి, లోకేష్ హామీ ఇచ్చిన విధంగా రెండు సెంట్లు స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణాలకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ కు వేలాదిమంది దరఖాస్తులు అందించారు. ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు జిల్లా నేతలు నేతాజీ పాశం రామారావు తదితరులు పాల్గొన్నారు. 16 నెలలు గడిచినా ఒక్కరికి స్థలం ఇవ్వలేదు, ఇల్లు కట్టలేదు అని ప్రశ్నించిన నేతలు, ఇంట గెలిచి రచ్చ గెలవాలని లోకేష్ కి హితవు పలికారు. నెల రోజులలో స్థలాలు ఇవ్వకపోతే భూ పోరాటం చేపడుతాం, లోకేష్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.