News9th Dec 04:25 PMSunil Byrisetty1 min read

ఫుడ్ లవర్స్‌కి క్రేజీ న్యూస్.. తిరుపతిలో ఈట్ స్ట్రీట్!

తిరుపతిలో ‘ఈట్ స్ట్రీట్’(ఫుడ్ కోర్ట్) ఏర్పాటవుతోంది. నగరపాలక సంస్థ ప్రస్తుత కార్యాలయానికి ఎదురుగా ఉన్న అచ్యుత దేవరాయలు మార్గంలో ఫుడ్ కోర్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో

ఫుడ్ లవర్స్‌కి క్రేజీ న్యూస్.. తిరుపతిలో ఈట్ స్ట్రీట్!
తిరుపతిలో ‘ఈట్ స్ట్రీట్’(ఫుడ్ కోర్ట్) ఏర్పాటవుతోంది. నగరపాలక సంస్థ ప్రస్తుత కార్యాలయానికి ఎదురుగా ఉన్న అచ్యుత దేవరాయలు మార్గంలో ఫుడ్ కోర్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో దీనిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఫుడ్ కోర్ట్‌లో మొత్తం 40 నుంచి 50 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 8/16 సైజులో ఉన్న 12 కంటైనర్లను ఆధునిక స్టాళ్లుగా మారుస్తున్నారు. మిగిలిన ఖాళీ స్థలాలను టెండర్ దక్కించుకున్న వారు స్టాళ్లుగా అభివృద్ధి చేసుకునేందుకు అనుమతిస్తారు. దాదాపు రూ.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు నగరపాలక సంస్థ కౌన్సిల్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. పనులు పూర్తయిన తర్వాత టెండర్ల ప్రక్రియ ద్వారా స్టాళ్లను కేటాయించనున్నారు.
Andhra Pradesh
Tirupati Eat Street
Food Court
Food Lovers
Achyuta Devarayalu Road
Municipal Corporation
Stall Tenders
కంటైనర్ స్టాళ్లు
ఫుడ్ స్టాళ్లు
ఈట్ స్ట్రీట్ నిర్మాణం
Scroll for the next article