News16th Jul 10:24 AMSunil Byrisetty1 min read

అమరావతిలో స్టార్‌ హోటళ్లు, ప్రైవేట్ స్కూళ్లు

అమరావతి రాజధాని నగరంలో ప్రైవేటు స్కూళ్లు ఐదు, స్టార్‌ ‌హోటళ్లు ఐదు నిర్మించేందుకు సిఆర్‌‌డిఏ వేర్వేరుగా టెండర్లను ఆహ్వానించింది. బుధవారం నుండి టెండర్‌ ‌డాక్యుమెంట్లు డౌన్‌‌లోడ్‌ ‌చ

అమరావతిలో స్టార్‌ హోటళ్లు, ప్రైవేట్ స్కూళ్లు
అమరావతి రాజధాని నగరంలో ప్రైవేటు స్కూళ్లు ఐదు, స్టార్‌ ‌హోటళ్లు ఐదు నిర్మించేందుకు సిఆర్‌‌డిఏ వేర్వేరుగా టెండర్లను ఆహ్వానించింది. బుధవారం నుండి టెండర్‌ ‌డాక్యుమెంట్లు డౌన్‌‌లోడ్‌ ‌చేసుకోవచ్చు. హోటళ్లకు సంబంధించి ఈనెల 22వ తేదీన ప్రీ ప్రపోజల్‌ ‌సమావేశం నిర్వహించనున్నారు. 30వ తేదీ నాటికి టెండర్‌ ‌దాఖలును పూర్తి చేయనున్నారు. దీనికోసం రాజధాని ప్రాంతంలో ఎకరం ధరను రూ.8.20 కోట్లుగా నిర్ణయించింది. ఇప్పటి వరకూ కేటాయించిన భూముల్లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. స్టార్‌ ‌హోటళ్లకు ఇచ్చే భూములను ఫ్రీ హోల్డ్‌ ‌పద్ధతిలో కేటాయించనున్నారు. దీని కోసం కనీసం రూ. 75 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. స్కూళ్లకు మాత్రం 33 ఏళ్ల లీజుకు ఇవ్వనున్నట్లు టెండర్లలో పేర్కొన్నారు. అమరావతి రాజధాని పరిధిలో ఇప్పటి వరకూ కేటాయించిన భూముల్లో అత్యధికంగా ఎకరం నాలుగు కోట్లుగా ధర నిర్ణయించారు. ఇప్పుడు ఎకరం రూ.8.20 కోట్లుగా నిర్ణయించారు. హోటళ్లకు సంబంధించి త్రీస్టార్‌ ‌హోటళ్లు మూడు, ఫోర్‌ ‌స్టార్‌ ‌హోటళ్లు రెండు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిలో తుళ్లూరు, రాయపూడి పరిధిలో నాలుగు హోటళ్లు, వెంకటపాలెం దగ్గర్లో జాతీయ రహదారికి అనుకుని బిట్స్‌ ‌పిలానీకి తూర్పు భాగంలో ఒక హోటల్‌ ఏర్పాటు చేయనున్నారు.
Andhra Pradesh
Star Hotels
Amaravati
CRDA
Private Schools
Tenders
Capital City
Infrastructure
ఆంధ్రప్రదేశ్
పెట్టుబడులు
మౌలిక సదుపాయాలు
అభివృద్ధి
Scroll for the next article