News12th Oct 02:22 PMSunil Byrisetty1 min read
సిఆర్డిఏ కార్యాలయానికి “నెట్ జీరో ఎనర్జీ – డిజైన్”
అమరావతిలోని సిఆర్డిఏ ప్రాజెక్ట్ కార్యాలయానికి ప్రతిష్టాత్మకమైన నెట్ జీరో ఎనర్జీ (డిజైన్) సర్టిఫికెట్‌ను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(IGBC) ప్రధానం చేసింది. అమరావతిలో ఈ తరహా గ
అమరావతిలోని సిఆర్డిఏ ప్రాజెక్ట్ కార్యాలయానికి ప్రతిష్టాత్మకమైన నెట్ జీరో ఎనర్జీ (డిజైన్) సర్టిఫికెట్‌ను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(IGBC) ప్రధానం చేసింది. అమరావతిలో ఈ తరహా గుర్తింపును పొందిన మొదటి భవనంగా సిఆర్డిఏ ప్రాజెక్టు కార్యాలయం నిలవడం విశేషం. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. ఈ సర్టిఫికేషన్ ద్వారా ప్రాజెక్టు కార్యాలయ భవనం తన వార్షిక విద్యుత్ అవసరాలన్నింటిని పునరుత్పాదక శక్తి వనరుల ద్వారా సమకూర్చుకునే విధంగా రూపొందించబడినట్లు గుర్తింపు లభించింది. ప్రాజెక్టు కార్యాలయం కోసం 540 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయబడుతోంది. మిగిలిన అవసరాల కోసం పునరుత్పాదక శక్తివనరుల సమర్ధవంతమైన వినియోగం ద్వారా పూర్తి స్థాయిలో “నెట్ జీరో ఎనర్జీ” స్థాయిని సిఆర్డిఏ ప్రాజెక్టు కార్యాలయం చేరుకోనుంది.
కమిషనర్ కె.కన్నబాబు మాట్లాడుతూ సిఆర్డిఏ ప్రాజెక్టు కార్యాలయం ఫ్లాగ్‌షిప్ నెట్ జీరో ప్రాజెక్ట్‌గా నిలిచిందని, పర్యావరణ పరిరక్షణ పట్ల సిఆర్డిఏ కట్టుబాటును ఈ గుర్తింపు ప్రతిబింబిస్తుందని, భవిష్యత్ ప్రాజెక్టులకు సైతం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2018లో ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌కు ఐజీబీసీ ప్లాటినం సర్టిఫికెట్ లభించడం రాష్ట్ర ప్రభుత్వం సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్ పట్ల తీసుకున్న ముందడుగుకు నిదర్శనమన్నారు. ఐజీబీసీ అందజేసిన ఈ గుర్తింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఏపీ సిఆర్డిఏ సంస్థకు గర్వకారణంగా, అలాగే మన రాష్ట్రం శక్తి వనరుల నిర్వహణ, సుస్థిర భవనాల నిర్మాణ దిశగా తీసుకుంటున్న చొరవను ప్రతిబింబిస్తుందని తెలిపారు.