News3rd Dec 03:20 PMSunil Byrisetty1 min read
ఎయిడ్స్ తగ్గించేలా అవగాహన కల్పించా
ఒకప్పుడు హెచ్ఐవీ గురించి తాను మాట్లాడానని, జాతీయ రహదారుల్లో డ్రైవర్లు ఎక్కువ ఎయిడ్స్ బారిన పడేవారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజ
ఒకప్పుడు హెచ్ఐవీ గురించి తాను మాట్లాడానని, జాతీయ రహదారుల్లో డ్రైవర్లు ఎక్కువ ఎయిడ్స్ బారిన పడేవారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో నిర్వహించిన రైతన్నా మీకోసం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 30 ఏళ్ల ముందు అత్యంత ప్రమాదకరంగా మారి, దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో బ్రేక్ సైలెన్స్ అని మొట్టమొదటిసారి తానే మాట్లాడానని గుర్తు చేశారు. నిశ్శబ్దాన్ని విడనాడి ఎయిడ్స్ గురించి మాట్లాడాలని, మీ పిల్లలతో కూడా చెప్పాలని ప్రజలందరినీ కోరానని గుర్తు చేశారు. లేకపోతే మానవ జాతి మిగలదని హెచ్చరించానన్నారు. అసెంబ్లీ మొత్తం కండోమ్స్ పెట్టి అలంకరించి, అవేర్ నెస్ తెచ్చామని, ఆరోజు అలా చేయడం వల్ల ప్రస్తుతం చాలావరకు కంట్రోల్ అయిందని గర్వంగా చెప్పగలుగుతున్నానని పేర్కొన్నారు. 2030 నాటికి భారతదేశంలో ఎయిడ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని సీఎం చంద్రబాబు వివరించారు.