News26th Nov 12:53 PMSunil Byrisetty1 min read
క్రెడాయ్ ప్రాపర్టీ షోకు సీఎంకు ఆహ్వానం
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు తీయించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంస్కరణలు తీసుకొచ్చారని ద కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడ
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు తీయించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంస్కరణలు తీసుకొచ్చారని ద కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) విజయవాడ చాప్టర్ చైర్మన్ సి. సతీష్ బాబు, అధ్యక్ష, కార్యదర్శులు జీఎస్ఆర్ మోహన్ రావు, కె. రఘురామ్ అన్నారు. బుధవారం వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్(చిన్ని)తో కలిసి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా 2026 జనవరి లో జరగబోయే 2026- క్రెడాయ్ ప్రాపర్టీ షోకు ముఖ్యమంత్రి హాజరు కావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం చంద్రబాబు నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలు రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కారుగా నిర్మాణ రంగాన్ని పరుగులు తీయిస్తున్నాయని ప్రశంసించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం వల్ల నిర్మాణ రంగం కూడా వృద్ధి చెందుతోందన్నారు. జనవరిలో నిర్వహించే క్రెడాయ్ ప్రాపర్టీ షో ద్వారా ప్రజలకు రియల్ ఎస్టేట్ రంగంపై విస్తృత అవగాహన పెంపొందించాలనే ఆలోచనతో నిర్వహిస్తున్నామని తెలిపారు. తద్వారా ప్రజలు పెట్టే పెట్టుబడిలో ప్రతి రూపాయి సద్వినియోగమవుతుందని వివరించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో ప్రాపర్టీ షోను విజయవంతం చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో క్రెడాయ్ విజయవాడ చాప్టర్ ఉపాధ్యక్షుడు బి. పవన్, సభ్యులు పి. శ్రీనివాస్ రాజు తదితరులు ఉన్నారు. క్రెడాయ్ ప్రాపర్టీ షోకు హాజరవ్వాలనే అభ్యర్థనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు.