News8th Jun 06:55 PMSunil Byrisetty1 min read

25 జిల్లాల్లో క్రికెట్ స్టేడియంలు

రాష్ట్రంలోని 25 జిల్లాల్లో క్రికెట్ గ్రౌండ్స్ వుండే విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో కృషి చేస్తామని విజయవాడ ఎంపీ, ఏసీఏ అధ్య‌క్షుడు కేశినేని శివ‌నాథ్ పేర్కొ్న్నారు. రాబోయే రెండెళ

25 జిల్లాల్లో క్రికెట్ స్టేడియంలు
రాష్ట్రంలోని 25 జిల్లాల్లో క్రికెట్ గ్రౌండ్స్ వుండే విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో కృషి చేస్తామని విజయవాడ ఎంపీ, ఏసీఏ అధ్య‌క్షుడు కేశినేని శివ‌నాథ్ పేర్కొ్న్నారు. రాబోయే రెండెళ్ల‌లో ఏసీఏ కి సొంత గ్రౌండ్లు వుండే విధంగా ప్రణాళిక రూపొందించ‌టం జ‌రిగిందన్నారు. ఏసీఏకి సొంత స్థ‌లాలు వున్న క‌ర్నూల్, నెల్లూరు ప్రాంతాల్లో క్రికెట్ గ్రౌండ్స్ అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. వీటితోపాటు మరింత మంది క్రికెట్ క్రీడాకారుల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు ఏపీఎల్ నిర్వ‌హించ‌బోతున్నామని వివరించారు. ఈ ఏపీఎల్ లో ప్ర‌తిభ గ‌ల క్రీడాకారుల‌ను గుర్తించి ఐపీఎల్‌లో ఆడే విధంగా కృషి చేస్తామ‌ని శివ‌నాథ్ అన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ 72వ యాన్యువ‌ల్ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ విజ‌య‌వాడలోని నోవాటెల్‌లో జరిగింది. ఈ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాలు ఏక‌గ్రీవంగా ఆమోదించ‌టం జ‌రిగింద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు.
Andhra Pradesh news
cm chandra babu
Vijayawada
Cricket stadiums in 25 districts
Kesineni Shivnath
25 జిల్లాల్లో క్రికెట్ స్టేడియంలు
Scroll for the next article