Sports10th Apr 05:42 PMSunil Byrisetty1 min read
ఒలింపిక్స్‌లో క్రికెట్.. 6 జట్లకే చోటు?
క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. క్రికెట్ ప్రేమికులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రోజు దగ్గర్లోనే ఉంది. క్రికెట్ ఆటను ఎట్టకేలకు ఒలింపిక్స్‌లో మళ్లీ చూడబోతున్నాం. దాదా
క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. క్రికెట్ ప్రేమికులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రోజు దగ్గర్లోనే ఉంది.
క్రికెట్ ఆటను ఎట్టకేలకు ఒలింపిక్స్‌లో మళ్లీ చూడబోతున్నాం.
దాదాపు 128 ఏళ్ల తర్వాత లాస్ ఏంజెలెస్ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కానుంది.
తాజాగా జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌లో క్రికెట్ సహా కొత్తగా ఆరు క్రీడలను పోటీల్లో చేర్చేందుకు ఆమోదించింది.
ఈసారి మొత్తం 351 మెడల్ ఈవెంట్లు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, క్రికెట్లో ఆరు జట్లు పోటీల్లో పాల్గొననున్నట్లు బోర్డు నిర్ణయించింది.
పురుషులు, మహిళల విభాగాల్లో ఆరు చొప్పున జట్లతో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. ఇది టీ20 ఫార్మాట్‌లో జరగనుంది.
అయితే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం జట్ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని ప్రచారం సాగుతోంది.
ఈ లెక్కన ప్రస్తుతం భారత్ 20170 పాయింట్లతో ఆల్‌టైమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్‌లో ఉండగా, ఆస్ట్రేలియా 12417 పాయింట్లతో రెండో ప్లేస్‌లో కొనసాగుతోంది.
ఈ లిస్ట్‌లో పాకిస్థాన్ ఏడో స్థానంలో ఉంది.
టాప్ 6 జట్లను ఎంపిక చేస్తే పాకిస్థాన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం డౌటేనని తెలుస్తోంది