Crime26th Mar 03:05 PMSunil Byrisetty1 min read
ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన నేరాలు
ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు తగ్గినట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ల సదస్సులో డీజీపీ మాట
ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు తగ్గినట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.
రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
కలెక్టర్ల సదస్సులో డీజీపీ మాట్లాడుతూ నేరస్థులపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు.
గత ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు నేరాలు తగ్గుముఖం పడుతున్నాయన్నారు.
2024 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి వరకు అంతకుముందు ఏడాదితో పోల్చితే నేరాలు 17% తగ్గాయని పేర్కొన్నారు.
'2023 జూన్-2024 జనవరి మధ్య మహిళలపై 18,114 నేరాలు జరిగాయని చెప్పారు. 2024 జూన్-2025 JAN వరకు 16,809 నేరాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిచారు.
గంజాయి సాగును 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాలకు తగ్గించగలిగాం' అని వివరించారు. ఇతర నేరాలు కూడా తగ్గుతున్నట్లు డీజీపీ చెప్పారు.